Monday, March 7, 2022

రాగలహరి: మలయమారుతం

సంగీతానికి స్పందింపచేసే గుణం మాత్రమే కాదు ప్రశాంతతను ఇచ్చే శక్తి కూడా ఉంది.

మన శాస్త్రీయ సంగీతంలో కొన్ని రాగాలు మనసుకు దివ్యౌషధాలు. 

మనసుకు ఆనందాన్ని కలిగించటంలో సంగీతానికి మించినది లేదు. 

కొన్ని రాగాలు వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది.  

 అటువంటి వాటిలో  ఒకటి  "మలయమారుతం"


మలయ మారుతం అంటే మలయ పర్వతం మీదినుండీ వీచే చల్లని సుగంధ భరితమైన గాలి అని చదివాను ఎక్కడో,

అది మనసుని రంజింప జేస్తుందనీ,ఆ అనుభూతినీ మాటల్లో చెప్పలేమనీ కూడా విన్నాను

ఆ మలయ పర్వత మెక్కడుందో ,ఆ గాలి సంగతేమిటో నాకు తెలీదు గానీ ,

ఈ రాగంలో చేసిన కీర్తనలైనా,పాటలైనా విన్నప్పుడు మాత్రం నిజంగా మాటలకందని అనుభూతి కలుగుతుందనడంలో సందేహంలేదు.


మలయ మారుతం కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని 16వ మేళ కర్త అయిన చక్రవాకం రాగం యొక్క జన్యం. 

హిందుస్తానీ పద్ధతిలో మలయ మారుతం అన్న పేరుగల రాగం కానీ,మలయ మారుతం రాగాన్ని పోలిన రాగం కానీ లేవు. ఐతే, ముఖ్యంగా వాయిద్యకారులు గత 50, 60 సంవత్సరాలుగా, మలయ మారుతం రాగాన్ని యధాతధంగా హిందూస్తానీ పద్ధతిలోకి ప్రవేశపెట్టారు. 

“మలయ మారుతం” ఉదయాన్నే పాడుకొనే ఆహ్లాదకరమైన రాగం. 


కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని “మనసా ఎటులోర్తునే నా ...మనవి చేకొనవే ఓ” అన్న చాలా ప్రసిద్ధ త్యాగరాజ కృతి, స్వరపరచబడింది “మలయ మారుతం” రాగంలోనే!

కరుణ రసాన్ని ఎంతో చక్కగా పోషించే “మలయ మారుతం” రాగం మనో ధర్మ సంగీత అంశాలైన రాగాలాపన, స్వరకల్పన లకు ప్రసిద్ధమైంది.


 ఈ రాగంలో “శ్రీ లోలా శ్రిత పాలా,సేవిత సుర గణలీలా “అనే చక్కని గీతం వింటుంటే ఎంత ప్రశాంతం గా ఉంటుందో కావాలిఅంటే మీరే వినండి 

(మా గురువు గారు శ్రీమతి గిరిజ కుమారి గారు ఆలపించిన శ్రీ లోలా శ్రిత పాలా, 
రాగం : మలయమారుతం  ,తాళం : రూపక )



No comments:

Post a Comment